
Mahesh Babu net worth:
టాలీవుడ్ లో అత్యంత ఆదరణ పొందిన జంటల్లో మహేష్ బాబు – నమ్రత షిరోద్కర్ ఒక్కటి. వీరి ప్రేమకథ 2000లో వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదలైంది. ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2005 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు, 20 ఏళ్ల ప్రేమను జరుపుకుంటున్న ఈ జంట, టాలీవుడ్‌లో హ్యాపీ కపుల్స్ లో ఒకటిగా గుర్తింపు పొందారు.
మహేష్ బాబు తెలుగు సినిమాల్లో అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ. 350 కోట్లు. నమ్రత ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌లో విజయవంతమైన హీరోయిన్. ఇప్పుడు ఆమె మహేష్ బ్రాండ్ మేనేజ్‌మెంట్, బిజినెస్‌లను చూసుకుంటున్నారు. ఆమె నెట్ వర్త్ సుమారు రూ. 50 కోట్లు. ఇద్దరి కలిపితే వీరి సంపద రూ. 400 కోట్లు దాటుతుంది.
లగ్జరీ ఆస్తులు & బిజినెస్‌లు
1. జూబ్లీ హిల్స్ హౌస్: హైదరాబాద్‌లో రూ. 28 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిలో ఉంటున్నారు.
2. బెంగళూరు ప్రాపర్టీ: ఇటీవల మహేష్ బెంగళూరులో ఒక విలాసవంతమైన స్థలం కొనుగోలు చేశారు.
3. దుబాయ్ విల్లా: 2023 ఏప్రిల్‌లో మహేష్ దంపతులు సముద్రతీరాన ఉన్న ఖరీదైన విల్లాను దుబాయ్‌లో కొనుగోలు చేశారు.
4. AMB Cinemas: హైదరాబాద్ లో ఉన్న ప్రీమియం మల్టీప్లెక్స్ AMB Cinemas మహేష్ బాబు ఓనర్‌షిప్‌లో ఉంది.
5. AN Palace Heights: 2023లో బంజారా హిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ఆసియన్ గ్రూప్‌తో కలిసి ప్రారంభించారు.
మహేష్, నమ్రత బిజీ లైఫ్ ఉన్నా కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. వీరి పిల్లలు గౌతమ్ – సితార కూడా తరచుగా సోషల్ మీడియాలో వీరి సరదా మిమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు.
ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. SS రాజమౌళి దర్శకత్వంలో భారతీయ పురాణ గాధల ఆధారంగా రూపొందే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ALSO READ: 100 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి Bollywood movie ఏదో తెలుసా?