యువ దర్శకులతో కలిసి పనిచేసేందుకు స్టార్ హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్స్‌తో పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పిన మహేశ్, మరో యంగ్ డైరెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరగుతోంది.
పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ తరువాత ఈ నగరానికి ఏమైంది సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. త్వరలో హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న ఈ యువ దర్శకుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఓ పాయింట్ వినిపించాడట. ఈ పాయింట్ పట్ల సుముఖంగా ఉన్న మహేష్ పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై మహేష్, తరుణ్ భాస్కర్ నుంచి ఎలాంటి ప్రకటనా రావటం లేదు.
ప్రస్తుతం తన 25 సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేశ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.