సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు(56) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదంలో ముగినిపోయింది.