సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ ఫొటోలు లీకయ్యాయి. పొలాల మధ్యలో మహేష్ నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. పల్లెటూరి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతుండడంతో మహేష్‌ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దాంతో వారిని అదుపు చేయలేని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
ఆ గుంపులో నుంచి ఓ వ్యక్తి షూటింగ్ సన్నివేశాలను వీడియో తీశాడు. ఆ వీడియోను మహేష్ అభిమానులే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ చిత్రంలో మహేశ్ గుబురు గడ్డంతో కొత్త లుక్‌లో కన్పించబోతున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోగా నటిస్తున్నారు. తమిళనాడులోని పొల్లాచి ప్రాంతంలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తైనట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. తర్వాతి షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.