
Mahesh Babu MB LUXE:
హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ AMB Cinemas గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018లో మహేశ్ బాబు – ఏషియన్ సినిమాస్ కలయికలో ప్రారంభమైన ఈ థియేటర్, హై-క్వాలిటీ స్క్రీన్‌లు, అధునాతన సౌండ్ సిస్టమ్, లగ్జరీ సీటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు, ఈ థియేటర్ కొత్తగా MB LUXE అనే ప్రీమియం స్క్రీన్‌ను ప్రారంభించి ప్రేక్షకులకు మరింత అధ్బుతమైన అనుభూతిని అందించనుంది.
సినిమా వీక్షణ అనుభవాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లేలా MB LUXE డిజైన్ చేశారు. మహేశ్ బాబు స్వయంగా ఈ లగ్జరీ స్క్రీన్‌ను ప్రకటించారు. కట్‌యింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, స్టైలిష్ ఇంటీరియర్, సౌండ్ & విజువల్ పరంగా హై-ఎండ్ ఫీచర్లు కలిపి మైండ్‌బ్లోయింగ్ అనుభూతిని కలిగించేలా రూపొందించారు.
AMB Cinemas ఇప్పటికే టాలీవుడ్ స్టార్లకు, ప్రముఖులకు ప్రైవేట్ స్క్రీనింగ్‌లు, ప్రీమియర్లకు ఫేవరెట్ స్పాట్. ఇప్పుడు MB LUXE వల్ల ఇది మరింత ప్రీమియం థియేటర్‌గా గుర్తింపు పొందబోతోంది. “సినిమా అనుభవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే మా లక్ష్యానికి ఇది మరో అడుగు” అని మహేశ్ బాబు చెప్పారు.
సినిమా ప్రేమికులకే కాదు, మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి సూపర్ న్యూస్! ఆయన ప్రస్తుతం SSMB29 కోసం ప్రిపేర్ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం, ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రాండ్‌గా తెరకెక్కనుంది. మహేశ్ బాబు ఈ మూవీ కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా పూర్తి చేశారని సమాచారం.
ALSO READ: US Deported Indians అడుగుతున్న డిమాండ్స్ కి ఖంగు తిన్న ప్రభుత్వం