ఇటీవలే ‘గూఢచారి’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్ ఆ తరహాలోనే మరో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈసారి వాస్తవ కథ ఆధారంగా సినిమా ఉండనుంది. ముంబై లోని తాజ్ మహల్ హోటల్లో 26/11 దాడుల్లో వందల మంది ప్రాణాలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి హీరో మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో రూపొందుతున్న ఈచిత్రం తన కలల ప్రాజెక్టు అని అడివి శేష్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించబోతున్నారు. ఈ సినిమా కోసం ఉన్నికృష్ణన్ కుటుంబ సభ్యుల నుండి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ వేసవి నుంచి సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘మేజర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను హీరో మహేష్‌బాబు షేర్ చేశారు.
Honoured to bring you the story of our National hero – Major Sandeep Unnikrishnan…
Sending my best wishes to @AdiviSesh, director @sashikirantikka, team @GMBents, @AplusSMovies… & Congratulations @SonyPicsIndia on your debut Telugu production👍🏻#MajorTheFilm pic.twitter.com/BZf4gSE1Rn— Mahesh Babu (@urstrulyMahesh) February 27, 2019