HomeTelugu Trendingదుబాయ్‌లో సర్కారు వారి పాట

దుబాయ్‌లో సర్కారు వారి పాట

Mahesh babu in dubai for sటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమా షూటింగ్‌ కోసం మహేష్‌బాబు దుబాయ్‌ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ దుబాయ్‌లో చేయబోతున్నట్టు సమాచారం. ఈ నెలాఖరు నుంచి 20 రోజుల పాటు దుబాయ్‌లో చిత్రీకరణ జరపబోతున్నారు. బ్యాంకింగ్ కుంభకోణాల చుట్టూ సాగే కథ. ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను మహేష్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకుకు వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్ మ్యాన్‌ నుంచి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu