HomeTelugu Newsత్రివిక్రమ్‌తో మహేష్ హ్యాట్రిక్‌ మూవీ

త్రివిక్రమ్‌తో మహేష్ హ్యాట్రిక్‌ మూవీ

Mahesh Babu hints at a reunటాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు అతడు, ఖలేజా మహేష్‌ కెరీర్ల్‌లో గుర్తింపుండి పోయే చిత్రాలుగా నిలిచాయి. అయితే మహేష్‌- త్రివిక్రమ్‌తో కలిసి మరో చిత్రం చేయబోతున్నారంటూ టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌ చేసిన ట్వీట్‌ అదే హింట్‌ను ఇస్తోంది. ఖలేజా సినిమా పదేలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ ట్విట్‌ చేసాడు. ‘ఖలేజా’ నటుడిగా నన్ను నేను తిరిగి ఆవిష్కరించుకున్న చిత్రమిది అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘నా కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా ‘ఖలేజా’. నాకు మంచి ఫ్రెండ్, అద్భుతమైన త్రివిక్రమ్‌కి కృతజ్ఞతలు. మన తదుపరి చిత్రం కోసం ఎదురు చూస్తున్నా. అతి త్వరలోనే’’ అంటూ మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌ ‘సర్కార్‌ వారి పాట’లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu