మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
గుంటూరు కారం చిత్రం నుంచి రెండో పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న సాయంత్రం 4.05 గంటలకు ‘ఓ మై బేబీ’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ కానుంది. పూర్తి పాటను డిసెంబరు 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన తొలి సింగిల్ ‘దమ్ మసాలా’ లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ మాస్ స్టామినాను ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాట ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ‘గుంటూరు కారం’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.