ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా నందమూరి బాలక్రిష్ణ ‘ఎన్టీఆర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి భాగాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మూవీ యూనిట్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ యొక్క సినీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు ఏఎన్నార్, శ్రీదేవి, సావిత్రి, కృష్ణ లాంటి వారి పాత్రలు ఉన్నాయి.
ఏఎన్నార్ పాత్ర కోసం సుమంత్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ వంటి వారిని ఎంచుకోగా కృష్ణ రోల్ కోసం మహేష్ బాబును స్వయంగా సంప్రదించారట బాలక్రిష్ణ. బాలయ్యే స్వయంగా అడగడంతో ఆలోచనలో పడ్డాడట మహేష్. అభిమానులు కూడ మహేష్ కృష్ణ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. మరి చివరికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది తెలియాల్సింది.