HomeTelugu NewsKalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌ బాబు.. ఎందుకో తెలుసా!

Kalki 2898 AD: ప్రభాస్‌ కోసం రంగంలోకి మహేష్‌ బాబు.. ఎందుకో తెలుసా!

Kalki 2898 ADKalki 2898 AD:పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.

ఈ సినిమాలో చాలా మంది స్టార్‌ హీరో, హీరోయిన్‌లు భాగం కానున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా.. దిశా పటాని మరో కీలక నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. మే 9న విడుదల కావలసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వల్ల జూన్ 27 కి వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఒక మైథాలజికల్ ఫిక్షనల్ డ్రామా అని తెలిసిందే.

అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణువు పాత్ర కూడా ఉండబోతోంది. ఆ పాత్రకి స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారట. ఇక మహేష్ బాబు కూడా కలిగే సినిమాలో భాగం కానున్నారు అని తెలిసిన ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు వాయిస్ వినడానికి ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు. కాగా ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. గతంలో మహేష్ బాబు జల్సా, బాద్షా, ఆచార్య సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu