సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్‌బాబు భార్య, పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేసింది. కేక్ కటింగ్ తర్వాత వారంతా కలిసి భోజనం చేశారు. చివరకు కృష్ణకు టాటా చెప్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పుట్టింది. హ్యాపీ బర్త్ డే ప్రియ’ అని సుధీర్ బాబు అన్నాడు. ఇందులో టీడీపీ ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.
It’s that date … love of my life was born. Happy Birthday priya ❤️ pic.twitter.com/7GWztK3LVf
— Sudheer Babu (@isudheerbabu) October 7, 2020