మహేంద్ర సింగ్ ధోనీ ఓ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు జట్టును ముందుకు నడిపించే గొప్ప నాయకుడు కూడా. దాదాపు 16 ఏళ్ళు టీంఇండియా జట్టుకు విశేషమైన సేవలను అందించిన ధోనీ అందరికి షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్‌బై చెప్పాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ధోనీ పేరు మారు మ్రోగిపోతుంది. ధోనీ కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ఈ 3 ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడిన ధోనీ. దాదాపు ఏడాదికాలంగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయాడు.
ఇక ధోనీ రిటైర్మెంట్ పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… “ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు” అంటూ 2011 వన్డే ప్రపంచకప్‌లో ధోనీ సిక్సర్ బాదిన ఫొటోను షేర్ చేశాడు మహేష్ బాబు.
How can I ever forget the iconic sixer!! World cup champions 2011 India!! Was in the stands at Wankhede, proud and tears rolling down… Cricket will never be the same… Take a bow @msdhoni 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/69vsf96820
— Mahesh Babu (@urstrulyMahesh) August 15, 2020