లాక్‌డౌన్ కారణంగా సెలబ్రెటీలు అందరు ఇంటే పరిమితమైయ్యారు. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ బాబు న్యూలుక్‌లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా, ఆ యాడ్ విడుదలైంది. ఈ ప్రకటనలో మహేశ్ బాబు లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇందులో మహేశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఓ లుక్‌లో చాలా యంగ్ గా కనపడుతుండగా, అన్న పాత్రలో కోరమీసం ఉన్నాడు. మహేశ్ బాబును ఎన్నడూ లేని విధంగా ఇలాంటి మీసంతో కనపడుతుండడం ఆయన అభిమానులను అలరిస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ కోసం ఈ యాడ్ షూట్ చేశారు. డబుల్ ధమాకా ఆఫర్ నేపథ్యంలో ఇలా మహేశ్ డబుల్ యాక్షన్‌లో కనపడి ప్రేక్షకులకు డబుల్ ధమాకా అందించాడు సూపర్ స్టార్.