HomeTelugu Trendingవెబ్‌ సిరీస్‌కు అంబాసిడర్‌గా సితార

వెబ్‌ సిరీస్‌కు అంబాసిడర్‌గా సితార

Mahesh babu Daughter sitara
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమత్ర శిరోద్కర్‌ ముద్దుకుతూరు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా చేయనుంది. ఓ 3డీ యానిమేషన్ వెబ్‌ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది సితార. ఈ వెబ్‌ సిరీస్ పోస్ట్‌రని బుధవారం రాత్రి మాదాపూర్లోని ఓ హోటల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణకు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ బాలీవుడ్ నటి నేహా ధూపియా తెలంగాణ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ పేరు ‘ఫంటాస్టిక్ తార’ ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు నయన్ మనీష్ డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu