HomeTelugu Newsఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌బాబు

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌బాబు

1 19సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. చేసిన 24 సినిమాల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న హీరో కూడా మహేష్ కావడం విశేషం. టాలీవుడ్ స్టార్స్ చాలామంది వివిధ భాషల చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ ను పెంచుకోవడానికి ఇదొక అవకాశం. మహేష్ కూడా బాలీవుడ్ లో సినిమా చేస్తారని, కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై మహేష్ ఎలాంటి క్లారిటీ ఇచ్చేవారు కాదు. అడిగితే చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. దీంతో మహేష్ బాలీవుడ్ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వచ్చేవి. మహేష్ నటించిన చాలా సినిమాలను బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లోకి తర్జుమా చేసి రిలీజ్ చేసేవారు. అలా అక్కడ అందరికి పరిచయం అయ్యారు మహేష్. ఇతర భాషల్లోకి నటించే విషయం గురించి మహేష్ బాబు ఇటీవలే ఓ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు సినిమాలతో హ్యాపీగా ఉందని, బాలీవుడ్ కు వెళ్లి సమయం వృధా చేసుకోవడం దేనికి అని ప్రశ్నించాడు. మహేష్ చెప్పిన సమాధానంతో బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం అయింది. బాలీవుడ్ హీరోలు సౌత్ కు వచ్చి సినిమాలు చేస్తుంటే.. మహేష్ మాత్రం బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదని చెప్పడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu