టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కారవాన్‌ను కొనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాన్‌ను హీరో దగ్గరుండి మరీ రెడీ చేయించుకున్నాడట. అందులో బాత్‌రూమ్, హాల్, కిచెన్, టీవీ సహా సకల సౌకర్యాలు ఉండేలా చూసుకున్నాడట. దీనికోసం మహేష్ ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ సెట్స్‌లో దీన్ని పార్క్ చేసేందుకు తాత్కాలిక షెడ్డును కూడా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ కారవాన్ ఫొటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బీజీగా ఉన్నాడు. మహానటి ఫేమ్ కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.