HomeTelugu Big Storiesలవ్‌ యూ మై సన్: మహేష్‌ బాబు

లవ్‌ యూ మై సన్: మహేష్‌ బాబు

mahesh 2
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కుమారుడు గౌతమ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మహేష్‌ తన ట్విటర్‌ ఖాతాలో .. ‘నా యంగ్‌ మ్యాన్‌కు 16వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు జీవితంలో అత్యుత్తమంగా ఎదిగే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను. కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రేమ, ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. గుర్తుపెట్టుకో.. నీకు ఎ‍ప్పుడు అవసరమయినా నీ వెన్నంటే ఉంటా! లవ్‌ యూ మై సన్‌.. నువ్వు ఊహించినంత కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

mahesh

ఇదిలా ఉంటే, మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ‘SSMB28’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu