గెడ్డం పెంచుతున్న మహేష్ బాబు!
మురుగదాస్ సినిమా కోసం మహేష్ బాబు సరికొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ ఇంటెలిజెన్స్ అధికారిగా కనిపించనుండగా.. కొంచెం కొత్త లుక్ లో అభిమానులను పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ గెడ్డం బాగా పెంచి సీరియస్ లుక్ లో అలరించనున్నాడని సమాచారం.
ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రంలో కథానాయకిగా బాలీవుడ్ బబ్లీ పరిణీతి చోప్రా నటించనుండగా.. ఎస్.జె.సూర్య ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. జూలై 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది!