సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది సితార. వీరికి సంబంధించిన ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా తన తండ్రి మహేష్ బాబు ఒడిలో ఎంతో హాయిగా నిద్రపోతోంది సితార. తండ్రి భుజాన్ని తలగడగా చేసుకుని నిదురిస్తూ కలలు కంటోంది. మహేష్ కూడా తన గారాల కూతుర్ని ప్రేమగా హత్తుకుని హాయిగా నిదురిస్తున్నాడు.
ఈ అరుదైన ఫొటోను నమ్రత ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. వేకువ ఝామున బేబీని అలా కౌగిలించుకుని నిదురపోవడం మస్ట్.. అలా చేయకపోతే ఉదయమే నిదుర లేవలేం. #వేకప్ మంత్ర # బేబి ఇన్ ఆర్మ్స్ # లవ్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో మహేష్ ఇంట్లోనే ఉంటున్నారు. త్వరలోనే సర్కార్ వారి పాట షెడ్యూల్ ని ప్రారంభించే అవకాశలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram