సూపర్ స్టార్ కృష్ణ…పుట్టినరోజు నేడు. సూపర్ స్టార్ కృష్ణ 1943,మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1960లో చేసిన పాపం కాశీకెళ్ళినా అనే నాటకంలో కృష్ణ నటించారు. ఇందులో శోభన్‌బాబు కూడా నటించడం విశేషం. ఆ తర్వాత భక్త శబరి,సీతారామ కళ్యాణం, ఛైర్మన్ వంటి నాటకాల్లో నటించి మెప్పించారు. నాటకాల్లో రాణించడంతో..మద్రాసు చేరి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు కృష్ణ. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ 1964లో ‘తేనె మనసులు’ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు కృష్ణ. ఆ తర్వాత మరో సినిమా చేసినా.. హీరోగా నటించిన మూడో చిత్రం ‘గూఢచారి 116’ ఆయనకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. అనంతరం అనేక బ్లాక్‌బ్లస్టర్ హిట్‌లు ఇచ్చిన ఆయన డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా తెలుగు సినిమాకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలకు మారుపేరుగా నటనలో ఎప్పటికీ సూపర్ స్టార్‌గా అభిమానులకు ఎవర్‌గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ 79 ఏళ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మహేశ్ బాబు, కోడలు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదిక ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ‘హ్యపీ బర్త్‌డే నాన్న. మీలాంటి వారు నిజంగా ఎవరు లేరు. మీరు రాబోయే రోజుల్లో మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022
‘చాలా సంవత్సరాలుగా మీతో నాకు ఎంతో ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలోకి ఎంతో ప్రేమ, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞతరాలును. మీరు నా భర్తకు, నాకు, మా అందరికీ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే మామయ్య. వి లవ్ యూ.’ అని నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గౌతమ్, సితారతో కృష్ణ కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు నమ్రతా.
View this post on Instagram