కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాల పడింది. ముఖ్యంగా రోజువారి కార్మికలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. దీంతో ఆ వర్గాలను ఆదుకునేందుకు. ప్రముఖులంతా ముందుకు వస్తున్నారు. కాగా దీనిలో భాగంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే కోటిరూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోన కేసులు చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో కొన్ని గ్రామాలను ఆయన దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
గుంటూరు సమీపంలోని పలు గ్రామాలను దత్తత తీసుకోవాలని మహేష్ భావిస్తున్నాడట. ఈమేరకు ప్రభుత్వం తో సంప్రదింపులు కూడా చేస్తున్నారు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే తన బావ గల్లా జయదేవ్ తో మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తెనాలి సమీప గ్రామాల్లో కొంత మందికి సహాయం చేసే విధంగా మహేష్ బాబు ఇప్పటికే ఒక ప్లాన్ కూడా చేసారని అంటున్నారు. రోజు కూలి పనులకు వెళ్ళడం కుదరని వారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వారి నిత్యావసర సరుకులను ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం పది కోట్ల మేర ఖర్చు చేసేందుకు సిద్దమయ్యారని అంటున్నారు.మరి ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.