సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌లో నిర్మితమైన చిత్రం ‘సర్కారువారి పాట’ 200 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అభిమానులతో ఇంటరాక్షన్ ను నిర్వహించింది. మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ .. పరశురామ్ లు ఈ ఈవెంట్ లో పాల్గొని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు.
మహేశ్ బాబు మాట్లాడుతూ .. “ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాలి. ఒక సీన్లో నా ముఖంపై తిట్టమని కీర్తి సురేశ్ తో పరశురామ్ చెప్పాడు. మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు బాబోయ్ అనేసింది. మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ ఊరుకోరు అంటూ భయపడిపోయింది.
నా ఫ్యాన్స్ ఏమీ అనరు .. ఇలాంటి సీన్స్ ను వాళ్లు ఎంజాయ్ చేస్తారు .. నిన్ను మరింత లవ్ చేస్తారు .. ఫరవాలేదు చేసేయండి అన్నాను. అంతగా అడిగితే గానీ ఆమె నన్ను తిట్టలేదు .. ఆ సీన్ చిన్నపాటి స్ట్రీట్ ఫైట్ లా ఉండాలని పరశురామ్ చెప్పాడు. ఇప్పుడు ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది”. మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.” అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు.