సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయాన్నీ అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు. మహేష్ బాబు తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ షోలో బాలయ్య, మహేష్ నుంచి గట్టి సీక్రెట్ లనే రాబట్టారు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఆయన సినిమా షూటింగ్ మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ వరకు అన్నింటిని ఆయన నోటినుంచే చెప్పించారు. ఇక దర్శకుడు ద్వారా కొన్ని సీక్రెట్లను రివీల్ చేయించి.. మహేష్ తో ఆ ఇన్సిడెంట్ ని ఫినిష్ చేయించారు. ఇక ఈ ఇన్సిడెంట్లల్లో మెహర్ రమేష్.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సివచ్చింది అనేది చెప్పమని కోరారు.
ఇక దీంతో మహేష్ ఈ విధంగా వివరించారు. ‘ ఓ సారి ముంబై మారిటన్ హోటల్‌లో నేను, ఫ్యామిలీతో పాటు టిఫిన్ చేయటానికి వెళ్ళాను. అక్కడ మహేష్ వచ్చాడు అని ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ కోసం నా దగ్గరకు వచ్చారు. నేను ఫ్యామిలీతో వచ్చాను ఇప్పుడు కాదు అని చెప్పగానే వాళ్లు వెళ్లిపోయారు. అంతలోనే మెహర్ రమేష్ వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా.. డైరెక్టర్ శంకర్ కుమార్తెలు అని చెప్పారు. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని ఆపాను. . సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు’ అంటూ ఆ ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది .