బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘యానిమల్’. ఈ మూవీలో రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా.. సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇక అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ఆడియెన్స్ ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో రణబీర్ కపూర్ వైలెంట్ మోడ్‌లో కనిపిస్తుండటంతో జనాల్లో కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఇక హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను డిసెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు.
ఇప్పటికే ముంబయిలో చేసిన ప్రమోషన్స్‌కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగులోనూ అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. దానికోసం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీని ఎంచుకున్నారు. నవంబర్ 27 తేదిన ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. అయితే ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇక ఈ విషయాన్ని మూవీయూనిట్ స్వయంగా వెల్లడించింది.