స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాడని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై నెలకొన్న సస్పెన్స్ కు ఫుల్స్టాప్ పెడుతూ ధోనీ టీం అధికారికంగా ప్రకటించింది .
ధోనీ సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలి సినిమాకు రమేశ్ తమిళ్మని దర్శకత్వం వహించనున్నాడు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇతర భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.
ఈ చిత్రానికి సాక్షి సింగ్ ధోనీ కథనందిస్తుండటం విశేషం. ఈ సినిమాకి సంబంధించి ఇతర విషయాలు తెలియల్సి ఉంది. అన్ని ప్రధాన భాషల్లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను అందించనున్నట్టు ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ తెలిపింది. తమిళంతోపాటు ప్రధాన భాషల్లో సైన్స్ ఫిక్షన్, కామెడీ డ్రామా, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లతోపాటు వివిధ జోనర్లలో అర్థవంతమైన కంటెంట్ సినిమాలు, ఇతర ప్రాజెక్ట్‌లు చేసేందుకు పలువురు డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టు ధోనీ ఎంటర్టైన్ మెంట్ పేర్కొంది.
Dhoni Entertainment forays into Mainstream Film Production with a Tamil Film ✨@msdhoni #MSDhoni𓃵 #TamilFilm #Cinema #Dhoni #DhoniEntertainment pic.twitter.com/sXGEveRmwg
— Jaya TV (@JayaTvOfficial) October 25, 2022