HomeTelugu Trendingమహేష్‌ 'మహర్షి' సెలబ్రేషన్స్‌

మహేష్‌ ‘మహర్షి’ సెలబ్రేషన్స్‌

2 9సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మహేష్‌ ఇంట సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. గురువారం రాత్రి మహేష్‌ బాబుతో పాటు వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, దేవిశ్రీ ప్రసాద్‌ ఇతర చిత్రబృందం కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. పార్టీలో విజయ్‌ దేవరకొండ కూడా పాల్గొన్నారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నైజాంలో రికార్డు స్థాయిలో ఓపెనింగ్‌ వసూళ్లను రాబట్టింది. తొలిరోజు రూ.6.38 కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికాలో తొలి రోజు 6,66,000 డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu