జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్‌కు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమాకి మూడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అవార్డులు పొందాయి. న్యాచురల్
ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రానికి గాను రెండు అవార్డులు దక్కాయి. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా చిత్రబృందాలు సంతోషంలో మునిగాయి. గతేడాది ‘మహానటి’ చిత్రానికి కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.