HomeTelugu Big Storiesఅనూహ్య పరిణామం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌

అనూహ్య పరిణామం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌

1 23
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు బీజేపీ భారీ షాక్‌ ఇచ్చినట్లయింది.

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీతో పవార్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడే తాజా బీజేపీ-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు ముంబయి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రమాణస్వీకారం అనంతరం మోడీ, అమిత్‌ షాకు ఫడణవీస్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం వారు కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu