HomeOTTMaharaja దెబ్బకి థియేటర్లే కాదు.. ఓటీటీ కూడా దద్దరిల్లింది!

Maharaja దెబ్బకి థియేటర్లే కాదు.. ఓటీటీ కూడా దద్దరిల్లింది!

Maharaja
Maharaja sets a new record on Netflix

Maharaja Netflix record:

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా బాక్సాఫీస్‌ వద్ద మాత్రమే కాక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అంతేకాకుండా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా సంచలనం సృష్టించింది.

తాజా సమాచారం ప్రకారం, మహారాజా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 6 వారాలు గడిచినా కూడా 8 దేశాల్లో టాప్ 10లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ, దక్షిణ భారతీయ చిత్రంగా నిలిచింది. Maharaja కి 18.6 మిలియన్ వ్యూస్ రాగా.. క్రూ సినిమాకి 17.9 మిలియన్ వ్యూస్, లాపతా లేడీస్ కి 17.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సౌత్ ఇండియా దాటి అంతర్జాతీయ గుర్తింపును అందుకుంది ఈ సినిమా.

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి (నటరాజ్), భారతి రాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునీష్కాంత్, వినోత్ సాగర్, బాయ్స్ మనికందన్, కల్కి, సచనా నిమిదాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుధన్ సుందరం, జగదీష్ పలానిసామి నిర్మించిన ఈ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

మహారాజా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ఓటీటీలో కూడా కొనసాగుతుంది. ఈ చిత్రానికి వచ్చిన విశేష స్పందన కోలీవుడ్ సినీ ప్రపంచంలో కూడా మైలురాయిగా నిలిచింది. విజయ్ సేతుపతి కెరియర్ లో 50వ సినిమాగా ఈ సినిమా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu