Maharaja Movie Review: నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మహారాజా. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్ర ట్రైలర్ కట్ సినిమాకి మరింత హైప్ తీసుకువచ్చింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 14 న ధియేటర్ లలో విడుదలైంది. ఆసక్తికరంగా విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాకి ఎక్కడ లేని పాజిటివ్ వచ్చింది. సినిమా కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి.
రివెంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది అని ఈ చిత్రం అదిరిపోయే రివ్యూస్ అందుకుంటుంది. అయితే సినిమా కథాజ్ స్క్రీన్ ప్లే, నటీనటులు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే సినిమాలో గోర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం గ్రాఫిక్స్ కూడా వాడాల్సి వచ్చింది.
అయితే మామూలుగా తెలుగు ప్రేక్షకులకి మాస్ సినిమాలు ఇష్టమే కానీ మరీ ఈ రేంజ్ వయోలెన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. కానీ తమిళ్ లో ఇలాంటి సినిమా వస్తే మాత్రం సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మహారాజా సినిమా మాత్రమే కాదు గతంలో వచ్చిన జైలర్ సినిమాలో కూడా రక్తపాతం ఎక్కువే కానీ ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
తమిళ్, మలయాళం ఇలా వేరే భాషల్లో వచ్చే ఇలాంటి సినిమాలకి బ్రహ్మరథం పట్టే తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఇలాంటి సినిమాలను ఎందుకు వెనకేసుకుని రావడం లేదు? దీనికి సమాధానం కచ్చితంగా ఇదే చెప్పలేకపోయినా స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు చేయకపోవడం అని చెప్పచ్చు. తమిళ్, మలయాళం ఇలా వేరే భాషల్లో హీరోలు ఒకే జోనర్ కి ఫిక్స్ అవ్వకుండా రకరకాల జోనర్లలో సినిమాలు తీస్తారు. తెలుగులో మాత్రం స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మీద పెడుతున్న దృష్టి కథ మీద పెట్టడం తక్కువైపోయింది.
స్టార్ హీరోలు తాము ఎంపిక చేసుకునే సినిమా కథలు మారిస్తే తెలుగులో కూడా ఇలాంటి మంచి హిట్ సినిమాలు ఆశించచ్చేమో చూడాలి.
Maharaja Movie Story:
కథ విషయానికి వస్తే మహారాజ (విజయ్ సేతుపతి) ఒక చిన్న సెలూన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. ఒక ప్రమాదంలో భార్యను కోల్పోయిన మహారాజా తన కూతురే ప్రాణంగా బతుకుతూ ఉంటాడు. ఒకరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మహారాజా తన ఇంట్లో చెత్తబుట్ట పోయిందని కంప్లయింట్ ఇస్తాడు. తన కూతురు ఊర్లో లేదని, ఆమె వచ్చేలోపు ఆ చెత్తబుట్టను కనిపెట్టమని పోలీసులను వేడుకుంటాడు.
అసలు చెత్త బుట్ట పోవడం ఏంటి? దానికి కంప్లయింట్ ఎందుకు? పోలీసులు కంప్లయింట్ తీసుకున్నారా? మహారాజా చెత్త బుట్ట దొరికిందా? అసలు ఆ చెత్త బుట్ట కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ డైరెక్టర్ మంచి కథను రాసుకుని స్క్రీన్ ప్లే ని కూడా ఎంగేజింగ్ గా రాసుకున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో మెయిన్ పాత్రలో కనిపించారు. మమతా మోహన్ దాస్, అభిరామి, దివ్య భారతి కూడా సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు.