కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రముఖమైన మహానంది ఆలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మండపం, కోనేరు పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీగా వరద ప్రవాహం ఉండటంతో మహానంది ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. మహానంది పరిసరప్రాంతాలు నీటమునిగిపోయాయి. మరోవైపు కుందూరు నది ఉధృతంగా ప్రవహరిస్తోంది. మహానందిలో పాలేరు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నంద్యాల, గాజులపల్లి, మహానందిద మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
#WATCH Andhra Pradesh: Mahanandi Temple in Kurnool district's Mahanandi gets flooded following incessant heavy rainfall since last night. Kundu river in the district is overflowing with flood water. pic.twitter.com/twuUVilFlP
— ANI (@ANI) September 17, 2019
భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని సిరివేళ్ళ, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 224 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరివేళ్ళ మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు తడిచి పోవడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు.