
Mahakumbh Viral Girl Monalisa remuneration:
కేవలం కొన్ని రోజుల్లో ఓ సాధారణ అమ్మాయి స్టార్‌గా మారిపోయింది. మోనాలిసా పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. మహాకుంభ్ సందర్బంగా తీసిన ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆమె భిన్నమైన అందం, సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇక ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అయితే బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది!
మోనాలిసా త్వరలో సనోజ్ మిశ్రా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న “The Diary of Manipur” చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. అందరి నోటా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖ్యంగా, ఆమెకు ఇస్తున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. 21 లక్షల రూపాయలు, అలాగే అడ్వాన్స్‌గా 1 లక్ష కూడా తీసుకుందని టాక్.
ఫిబ్రవరి 12న ఇండియా గేట్, ఢిల్లీ లో తొలి షూట్ ప్లాన్ చేసినా, అనుమతి సమస్యల వల్ల అది వాయిదా పడింది. అయితే త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. అభిమానులు ఆమె వెండితెర ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ కూడా మొదలుపెట్టేసింది మోనాలిసా. ఒక ప్రముఖ జువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపిక అయ్యింది. డీల్ విలువ 15 లక్షల రూపాయలు అని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి!
ఓ వీడియోలో మోనాలిసా తన ఆనందాన్ని పంచుకుంది. “నమస్తే. నేను మహాకుంభ్‌లో గజమాల అమ్మేందుకు వెళ్లాను. కానీ భగవంతుడు నా జీవితం మార్చేశాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా నన్ను పర్సనల్‌గా ఇంటికొచ్చి అప్రోచ్ అయ్యారు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కనేదాన్ని. ఇప్పుడు అది నిజమవుతోంది. ఈ క్షణం ఎప్పటికీ మరిచిపోలేను!” అని చెప్పింది.
మోనాలిసా స్టోరీ నిజంగానే ఇన్స్పైరింగ్. సాధారణ అమ్మాయి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ జర్నీ వెండితెరపై ఎలా ఉంటుందో చూడాలి!