అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం
ఈ సినిమా షూటింగ్ మహేబలేశ్వరంలో జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా నాగార్జున
తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ”మహాబేశ్వరంలో మేఘాల నడుమ నడుస్తుంటే.. ప్రపంచ
శిఖరంపై ఉన్న భావన కలుగుతోందని” ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ కొండలపై నడిచే చిన్న
వీడియో క్లిప్ ను కూడా షేర్ చేశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను
సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్న నాయనా, ఊపిరి వంటి
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూనే.. ఒకవైపు డివోషనల్ సినిమాల్లో నటిస్తున్నాడు. హథీరాంబాబా
జీవిత చరిత్ర ఆదారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.