‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ ‘మహాసముద్రం’ తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసి ఆగస్ట్ 19న సినిమా విడుదల చేసేందుకు నిర్మాతసన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా అదితిరావు, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్, యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.