‘ఆర్ ఎక్స్ 100’ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. శర్వానంద్ .. సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల కథ ఇది అని వినికిడి. ఒకరిపై ఒకరికి గల ద్వేషాన్ని తీర్చుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అంతగా వాళ్ల మధ్య ద్వేషం పెరగడానికి కారణం ఏమిటనేదే సస్పెన్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని ఆగస్ట్ 19న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.