పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటించిన తొలి చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు కూడా శ్రోతలను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి 8న) విడుదల అయిన మగువా మగువా పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. తాజాగా చిత్రం నుండి మగువా మగువా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.