HomeTelugu Trendingకోహ్లీ, రానా, తమన్నా తదితరులకు మద్రాసు హైకోర్టు నోటీసులు

కోహ్లీ, రానా, తమన్నా తదితరులకు మద్రాసు హైకోర్టు నోటీసులు

madurai bench sents notice
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు సంబంధించి పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్ లకు నోటీసులు ఇచ్చింది. ఆన్ లైన్ రమ్మీకి ఎంతో మంది బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దీన్ని నిషేధించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu