మూడు వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ కి ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో కాస్త జోరు తగ్గింది. ఆ తరువాత నటించిన ‘ఈడోరకం ఆడో రకం’ సినిమా హిట్ తో సక్సెస్ బాట పట్టాడు. ఇప్పుడు వరుస సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం ‘అంధగాడు’,’కిట్టు ఉన్నాడు
జాగ్రత్త’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. నిజానికి రాజ్ తరుణ్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేశారు. దీనికి గానూ.. హీరో గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. కానీ రాజ్ తరుణ్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కాస్త సుమంత్ అశ్విన్ చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని
స్వయంగా చిత్ర నిర్మాత మధురాశ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
హీరోలకు అడ్వాన్స్ తీసుకునేప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ సినిమా హిట్ అయిన తరువాత ఉండదు.. సక్సెస్ అనేది శాశ్వతం కాదనే విషయం కొందరికి తెలియడం లేదు.. రాజ్ తరుణ్ కి అడ్వాన్స్ ఇచ్చి కూడా అతనితో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాం. అడ్వాన్స్ తీసుకునేవరకు బాగానే ఉన్నాడు.. ఆ తరువాత అసలు ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు. అందుకే ఇక అతడి స్థానంలో మరో హీరోను తీసుకోవాల్సివచ్చింది. రవితేజ ఓకే చేసిన సబ్జెక్ట్ కావడంతో మరో ఆలోచన లేకుండా రాజ్ తరుణ్ కోసం కొనేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని మధురాశ్రీధర్ అన్నారు.