హీరోయిన్ రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సోషల్ మీడియాలో చక్కర్లు పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయంపై సెలబ్రెటీలతో పాటు, రాజకీయవేతలు కూడా స్పందించారు. ఈ క్రమంలో తెలుగు నటి మాధవి లత ఈ సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆమె మాట్లాడిందంటే.. రష్మిక డీప్ ఫేక్ వీడియో మరీ అంత దారుణంగా, అసభ్యకరంగా ఏమీ లేదని, ఆమె కంటే రష్మిక ఇంకా దారుణమైన దుస్తులు వేసుకుని, ఈవెంట్లు, సినిమాల్లో ఎక్స్ పోజ్ చేసిందని, ఒక స్టార్ హీరోయిన్ ఓ ఇష్యూ మీద రియాక్ట్ అయితే ఇలానే స్పందిస్తారని, పైగా ఇలాంటి వాటి మీద స్పందించడం కూడా మంచిదే.. స్పందించాలి.
రష్మికకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు నిలిచాయని వార్తను విన్నాను. అది నవ్వొచ్చింది.. రష్మికకు కాదు మీరు అండగా నిలబడాల్సింది. బయట ఎంతో మంది మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి. వారికి అండగా ఉండండి. వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి. రష్మిక ఏమీ సావిత్రి, సాయి పల్లవి, మాధవీలతలా పద్దతిగా కనిపించదు. అంటూ ఇలా మాధవీలతా చెప్పుకుంటూపోయింది. ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. మొదటి సారి సరిగ్గా మాట్లాడావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.