సోషల్ మీడియాలో తరచూ కాంట్రవర్సీలతో యాక్టివ్‌గా ఉంటుంది మాధవిలత. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ బ్యూటీ. తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌పైనే విరుచుకు పడింది ఈ ముద్దుగుమ్మ. సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వరసగా పెళ్లిళ్ళ్లు చూసి కరోనా వైరస్ అంతగా ఉన్న సమయంలో కూడా పెళ్లి ఎలా చేసుకుంటున్నారు బాబూ.. మాస్కులతో పెళ్లిళ్లు అవసరమా.. అంత ఆగలేకపోతున్నారా అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.ఇప్పుడు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు సహాయం చేద్దామంటూ పిలుపునిచ్చింది మాధవి లత. దీనిపై ఈమెకు ఊహించని షాక్ తగిలింది. అంతా సపోర్ట్ చేస్తారేమో అనుకుంటే.. ఆమె ఫాలోయర్సే షాక్ ఇచ్చారు. వాళ్ల నుంచే వ్యతిరేకత వచ్చింది. మమ్మల్ని సాయం అడగకపోతే అదేదో నువ్వే చేయొచ్చు కదా అంటూ మాధవి లతకు కొందరు నెటిజన్స్ కౌంటర్స్ వేయడం గమనార్హం. దాంతో దెబ్బకు అమ్మడి బుర్ర గిర్రున తిరిగింది. వెంటనే కోపం నషాలానికి అంటింది. అంతే.. మాధవి లత వాళ్లపై మండిపడింది.
ఈ సందర్భంగా తన ఫేస్ బుక్‌లో ఓ ఫైరింగ్ వీడియో రిలీజ్ చేసింది. ‘నేను ఈ పోస్ట్ పెట్టేముందే అనుకున్నా.. దీనిపై సొల్లు కామెంట్స్ పెట్టే వీధికుక్కలకంటే నీఛమైన వెధవలు తయారౌతారని.. అనుకున్నట్టుగానే చేశారు. వచ్చినవి 26 కామెంట్లు అయితే అందులో 20కి పైగా కామెంట్లు నీఛమైనవే. అరే లుచ్చా.. లఫంగి ఫెలోస్.. నేను కొనిపెట్టేదే అయితే ఫేస్ బుక్‌లో పోస్ట్ ఎందుకు పెడతా.. మీ బాబుగారి, తాతగారి ఆస్తి నాకు రాసిచ్చారా? నాపై బంగారాలు దిగేశారా? సాయం చేయాలని మీరు నాకు చెప్పాల్సిన పనిలేదు.. నాకు చేయాలనిపిస్తే చేస్తా. మొన్న లాక్ డౌన్‌లో ఫుడ్ కోసం డొనేషన్లు కావాలంటే నాకు వచ్చింది 17 వేలు మాత్రమే. ఖర్చు అయ్యింది రూ.30 వేలు. వాటితో పాటు చాలా చేశాం. వాటికి ఎక్స్ ట్రా మరో రూ. 20 వేలు అయ్యాయి. ఇవన్నీ ఎవరు ఇస్తారు. నా ఫౌండేషన్‌ని డోనర్స్ ఎవరూ లేరు. ఫేస్ బుక్‌లో ఉన్న నిజమైన ఫాలోవర్స్ మాత్రమే డొనేట్ చేస్తున్నారు.
నేను బ్రెయిన్ ట్యూమర్ అబ్బాయికి సాయం చేయడని మందుల చీటీ పెట్టి ఫోన్ నంబర్ కూడా ఇచ్చా. ఆ అబ్బాయికి ఫోన్ చేసి నీకు బ్రెయిన్ ట్యూమరా అని ఎదవ సొల్లు పెట్టొద్దు. ఎందుకంటే ఆ జబ్బు మీకు వస్తే నొప్పి తెలుస్తోంది. సాయం చేయలేకతోనే నోరూ మూసుకుని ఉండండి. ఎందుకు మీకంత గోక్కునే జబ్బు. సాయం చేయలేనోడు కామెంట్లు ఎందుకు పెడుతున్నారు. ఇలాంటి వాళ్లు వీధి కుక్కలకంటే నీఛమైన వాళ్లు. చైనా డొక్కు ఫోన్లు కొనుక్కుని ఫేస్ బుక్ ఇన్ స్టాల్ చేసుకుని పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. రూ. 200 కూడా సాయం చేయలేని నీ బతుక్కి నీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఎందుకు?. నాకు డబ్బులు ఇచ్చేవాళ్లు ప్రశ్నలు వేయడం లేదు.. రూపాయి పెట్టని మీరెవ్వర్రా నన్ను అడగడానికి? చేస్తే మూసుకుని సాయం చేయండి. దీనిపై కూడా కామెంట్లు చేస్తారు.. మీరు ఎవర్రా చెప్పడానికి. పనికి మాలిన కామెంట్లు వాళ్లు నా ఫేస్ బుక్‌లో ఉంటే ఎంత? పోతే ఎంత? మర్యాదగా నా ఫేస్ బుక్ నుంచి దొబ్బేయండి. ఆ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్‌కి ఒక నెల మందులు కొనాలంటే రూ. 25 వేలు అవుతుంది. అంత ఖర్చపెట్టలేని స్థితిలో నా ఫౌండేషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. మీకు మంచి మనసు ఉంటే మందులు కొనండి. పిచ్చి కుక్కల్లా మొరిగే వాళ్లు వీధిల్లోకి వెళ్లి మొరగండి. నా ఫేస్ బుక్ స్ట్రీట్ కాదు మొరగడానికి’ అంటూ ఇష్టమొచ్చినట్లుగా నెటిజన్లపై ఫైర్ అయ్యింది మాధవీలత.