HomeTelugu Big StoriesMadhapur Drug Racket లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు!

Madhapur Drug Racket లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్టు!

Madhapur Drug Racket: Famous Choreographer Arrested!
Madhapur Drug Racket: Famous Choreographer Arrested!

Choreographer Kanha Master in Madhapur Drug Racket:

తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య పోలీసులు డ్రగ్స్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులపై వరుస దాడులు చేస్తూ పలువురిని అరెస్టు చేస్తున్నారు. తాజాగా మాదాపూర్ ఓయో హోటల్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో నలుగురు వ్యక్తులు పోలీసుల చేతికి చిక్కారు.

ఈ ఘటనలో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి, హైదరాబాదుకు చెందిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి లతో పాటు విశాఖపట్నానికి చెందిన స్టాక్ మార్కెట్ బ్రోకర్ గంగాధర్, న్యాయవాది శాకి కూడా అరెస్టు అయ్యారు. పోలీసులు ఎండిఎంఏ, చరస్, ఓజి కుష్ డ్రగ్స్ తో పాటు ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించారు. కన్హా మహంతి బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న మహంతి, ఆమెతో కలిసి డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో పట్టుబడ్డారు.

అరెస్టయిన నలుగురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం సెక్షన్లు 8(C), 22(C), 27, 29 కింద కేసు నమోదైంది.

కన్హా మహంతి ప్రముఖ టీవీ డాన్స్ షోలలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డాన్స్ షోలలో పాల్గొని విజేతగా నిలిచిన మహంతి, “డి షో”లో చాలా కాలం పాటు పని చేశారు. తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహంతి, డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారుల ముఠాను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజలను డ్రగ్స్ దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu