Homeతెలుగు వెర్షన్మద్దిశెట్టి వేణుగోపాల్ రావు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

మద్దిశెట్టి వేణుగోపాల్ రావు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

Maddisetty Venugopal
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. మద్దిశెట్టి వేణుగోపాల్ రావు.  ప్రస్తుతం ప్రజల్లో  మద్దిశెట్టి వేణుగోపాల్ రావు పరిస్థితేంటి ?,  అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. పేస్ గోపాల్ గా బెంగళూరు వ్యాపార వర్గాల్లో పేరున్న మద్దిశెట్టి వేణుగోపాల్ రావు ఉమ్మడి ప్రకాశం జిల్లా పామర్రు మండలం లక్ష్మీ నరసింహ పురం గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం అమెరికా లోని న్యూ పోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఏంబిఏ పూర్తి చేయడం జరిగింది. వేణుగోపాల్ రాజకీయాల్లో రాకముందు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా  జీవితాన్ని మొదలు పెట్టి,  తర్వాత కాలంలో అక్కడే వ్యాపార రంగం లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఇండియా వచ్చి  పేస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో బెంగళూరు కేంద్రంగా పలు వ్యాపారాలు స్టార్ట్ చేశారు.  
 

ఐతే, వేణుగోపాల్ కి  రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో 2008 లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో చేరి,  2009 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు, అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనం కావడంతో  కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన  వేణుగోపాల్  2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసి,  తన ప్రత్యర్థి మరియు బంధువైన కదిరి బాబురావు మీద విజయం సాధించడం జరిగింది.

 

ఇంతకీ,  రాజకీయ నాయకుడిగా  మద్దిశెట్టి వేణుగోపాల్ రావు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో  మద్దిశెట్టి వేణుగోపాల్ రావు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ రావు పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మద్దిశెట్టి వేణుగోపాల్ రావు కి ఉందా ?, చూద్దాం రండి.  ముఖ్యమంత్రి జగన్ కు విశ్వాస పాత్రుడిగా మద్దిశెట్టి వేణుగోపాల్ రావు మెలుగుతూ వస్తున్నారు. ముఖ్యంగా మద్దిశెట్టి జగన్ రెడ్డికి ఆర్ధికంగా తోడుగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ రావు జగన్ రెడ్డి ఆర్థికంగా చాలా బాగా ఉపయోగపడ్డారు.      
 
నిజానికి మద్దిశెట్టి వేణుగోపాల్ రావుకి జగన్ రెడ్డి  మంత్రి పదవి ఇవ్వాలని కూడా భావించారు. అయితే, వేణుగోపాల్ ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ,  తన నియోజకవర్గంలో కంటే ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటూ వస్తున్నారు.  ఆయన రాజకీయం చేసే దానికంటే..  తన వ్యాపారాలు చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే, జగన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని టాక్. ఇక దర్శి నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ రావు  సోదరుడు శ్రీధర్ షాడో ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ విషయం అధికార వైకాపా పార్టీ నేతలే చెబుతున్నారు.  అయినప్పటికీ ప్రజల్లో మద్దిశెట్టి బలమైన ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయన నేటికీ రాణిస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉంది. ఆయన తన సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu