
Mad Square Target Collections:
టాలీవుడ్‌లో ఎన్నో సీక్వెల్స్ వస్తున్నాయి, కానీ ‘Mad Square’ మాత్రం ప్రత్యేకమైన హైప్‌తో రాబోతోంది. 2025 మార్చి 28న ఈ మాస్, యూత్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి రాబోతుంది. ఫస్ట్ పార్ట్ బిగ్ హిట్ అవడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి.
యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే కామెడీ, ఇంట్రెస్టింగ్ కథతో ముందుకొస్తున్న ఈ సినిమా ముఖ్యంగా కాలేజ్‌గాళ్లకు తెగ ఎంజాయ్ చేసే సినిమాగా మారేలా ఉంది. కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నార్నే నితిన్, సందీప్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. వీరితో పాటు ప్రియాంక జవల్కర్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, ‘Mad Square’ హిట్ అవ్వాలంటే వరల్డ్‌వైడ్‌గా రూ. 23 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తెచ్చుకోవాలి. టాలీవుడ్‌లోనే అయితే రూ. 16 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా ఉంది. అయితే ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటలు ఓ మజా తెస్తున్నాయి. ప్రామోషనల్ మెటీరియల్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కానుంది. వీటన్నింటితో సినిమా మీద మరింత హైప్ పెరుగుతోంది.
‘Mad Square’ సినిమాకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కామెడీ, యాక్షన్, యూత్ ఫుల్ కంటెంట్ ఉన్న ఈ సినిమా మార్చి 28న ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.