HomeTelugu Trendingమాచర్ల నియోజక వర్గం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తుంది

మాచర్ల నియోజక వర్గం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తుంది

Macherla niyojakavargam mov

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో అవినీతి రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డిగా కనిపించనున్నాడని అంటున్నారు. కథా నేపథ్యానికి తగినట్టుగా, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే తరహాలో ఈ సినిమా నుంచి ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు అప్ డేట్ ను ఈ నెల 26వ తేదీ 10:08 నిమిషాలకి విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. బహుశా ఆ రోజున నితిన్ ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో కృతి శెట్టి – కేథరిన్ హీరోయిన్‌లుగా నటించానున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. ‘భీష్మ’ తరువాత నితిన్ చేసిన మూడు సినిమాలు పరాజయాల జాబితాలో చేరిపోయాయి. దాంతో ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.

నయనతార, విఘ్నేష్ శివన్‌పై కేసు నమోదు

Recent Articles English

Gallery

Recent Articles Telugu