నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే చేశావే ప్రోమోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇక ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. అయితే అనూహ్యంగా రీసెంట్‌గా రిలీజైన పోస్టర్‌లలో ఆయన పేరు కనిపిచండం లేదు. ఈ సినిమాకు దర్శకుడిగానూ అభిషేక్ నామా తన పేరే వేసుకున్నాడు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.