కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్.. మవీరన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు లో మహావీరుడు అనే టైటిల్ తో విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదలైంది.
ఈ సినిమాలో శివ కార్తికేయన్ పాత్ర రెండు విభిన్నమైన షేడ్స్ ను కలిగి ఉంది. కొన్ని సన్నివేశాల్లో ప్రతి చిన్న విషయానికి భయపడేలా కనిపించగా.. కొన్ని సన్నివేశాల్లో విలన్ తో పోరాడే సన్నివేశాలు చూపించారు. మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా లో మ్యాటర్ ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా శివ కార్తికేయన్ పాత్ర యొక్క ట్విస్ట్ మరియు స్క్రీన్ ప్లే విభిన్నంగా ఉండబోతుంది అనిపిస్తుంది.
ఈ సినిమాలో తెలుగు నటుడు సునీల్ కీలక పాత్రలో నటించడం వల్ల ఇక్కడి ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ దర్శకుడు మిస్కిన్ నటించగా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి హీరోయిన్‌గా నటించింది.