అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య .. విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్ వస్తున్న సినిమా ‘థాంక్యు’. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్పటికే ..విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవ్వడంతో ఇన్నాళ్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో.. ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా ‘మారో మారో’ సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మొత్తం లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రోమో ఆసక్తికరంగా అనిపిస్తుంది.
అయితే ఈప్రోమోలో ఎక్కడా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు ఈ సినిమాల రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా మాళవికా నాయర్..అవికాగోర్ సెకెండ్ లీడ్స్ పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు..శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.