‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ హేమ చేసిన వ్యాఖ్యలపై నరేశ్ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడింది అని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.
కాగా ఈ సారి ‘మా’ ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. మా ఎన్నికల బరిలో నటుడు ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఉన్నారు. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు అనే నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ ఏడాది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.