ఈరోజు (ఆదివారం) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇప్పటికే పోలింగ్ బూత్‌లో సందడి మొదలైంది. ఇప్పటికే మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి కుమార్, మంచు లక్ష్మీ, పోసాని, వడ్డే నవీన్, సుమ, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచు మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ చేయి కలిపాడు. పవన్ కళ్యాణ్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్నయ్య, మోహన్ బాబు మంచి ప్రెండ్స్ ఆన్నారు. మా ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదు. నేను ఎవరికి ఓటు వేశానో చేప్పలేను. ఇండస్ట్రీ రెండుగా చీలీపోలేదు అన్నారు. వ్యక్తిగత దూషణ తగదు అన్నారు. తిప్పికొడితే 900 మంది లేరు. సినిమా తీసేవాళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలి అన్నారు. నరేష్ మాట్లాడుతూ.. ఇప్పటికే 30% ఓటింగ్ పూరైంది అన్నారు.